మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ భేటీ అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పార్టీపైనే కాకుండా టీపీసీసీ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. అయితే.. దీంతో కాంగ్రెస్ అధిష్టానం మర్రి శశిధర్ రెడ్డిపై ఆరేళ్లు బహిష్కరణ వేటు వేసింది. అయితే.. ఇప్పటికే అమిత్ షాతో భేటీ అయ్యి బీజేపీలోకి వెళ్లేందుక సిద్ధంగా ఉన్న ఆయన పై కాంగ్రెస్ బహిష్కరించడమేంటనీ ఆపార్టీ నేతలే చర్చించుకున్నారు. అయితే.. అందరూ అనుకున్నట్లుగానే నేడు బీజేపీలో చేరారు మర్రి శశిధర్ రెడ్డి. మర్రి శశిధర్ రెడ్డి జాయినింగ్ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎంపీ అరవింద్, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ లు పాల్గొన్నారు.
Also Read : Sai Pallavi: సాయి పల్లవి షాకింగ్ డెసిషన్.. ఫ్యాన్స్ ఏమైపోవాలి..?
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. తెలంగాణ కుటుంబ పాలన నడుస్తోందని, కేసీఆర్ కుటుంబంతో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ మాత్రమే పోరాడుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృష చేస్తానన్నారు.