Margani Bharat: ‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన మార్గాని భరత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్ మేనిఫెస్టో ఆవిష్కరించారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద అశేష జనవాహిని, నగర ప్రముఖుల సమక్షంలో ‘భరత్ టెన్ ప్రామిసెస్’ పేరుతో ఈ మేనిఫెస్టోను రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నగరంలో రౌడీ షీటర్స్, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వంటి సంఘ విద్రోహక శక్తులను నగర బహిష్కరణ చేసి ప్రశాంతమైన నగరంగా ఉంచడం. వారిలో పరివర్తన వచ్చిన తరువాత మళ్ళా నగరంలోనికి అనుమతించడం. నగర వాసులకు 24 గంటలూ మంచినీటి సరఫరా, నగరంలోని యువతకు పదివేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ధ్యేయమని ఎంపీ భరత్ తెలిపారు.
Read Also: PBKS vs CSK: పంజాబ్‌తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..
Also Read
- Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
- Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
- CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
- Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
ఇక, రివర్ సిటీ అందాలు చూసేలా ఘాట్లను ఏకం చేయడం, గోదావరి బండ్ ను హైదరాబాద్ టాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేయడం తన సంకల్పంగా తెలిపారు భరత్. స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దడం, రెండు మూడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్ మెంట్, ఇంక్యుబేషన్ సెంటర్స్ తీసుకురావడం, జగనన్న కాలనీలలో 40 వేల మందికి ఇళ్ళు కట్టించి లబ్ధిదారులకు అప్పగించే బాధ్యత తనదని అన్నారు. మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి మాదిరిగా లాలా చెరువు, పిడింగొయ్యి, బొమ్మూరు, వేమగిరి జంక్షన్లలో కూడా ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తానని ఎంపీ భరత్ ప్రామిస్ చేస్తూ నగర వాసులకు చెప్పారు. ఇవి కాకుండా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీల నిర్మాణం తదితర మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ప్రతి రోజు గుడ్ఊ మార్నింగ్, రాజన్న రచ్చబండ కార్యక్రమాలు, వారం వారం అధికారులతో రివ్యూ నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని ఎంపీ భరత్ తెలిపారు. సిటీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై ప్రజలకు సేవలందిస్తానని, రాజమండ్రిని విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..