Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
- ఎలాన్ మస్క్‌పై ఓవైసీ స్పందనకు కిరెన్ రిజిజు ప్రశంసలు..
- భారత వ్యతిరేక ముఠా ఎవరో అర్థమైంది అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు..
- ప్రతిపక్ష నేతలు ఓవైసీని చూసి నేర్చుకోవాలని హితవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై ప్రశంసలు కురిపించారు. ఓవైసీ ముస్లిం-కేంద్రీకృత విధానాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, భారతదేశ జాతీయ ప్రయోజనాల విషయంలో ఆయన చాలా హేతుబద్ధంగా మాట్లాడుతారని రిజిజు అన్నారు. ప్రతిపక్ష నేతలు ఓవైసీని చూసి నేర్చుకోవాలని, ఇప్పుడు ‘‘భారత వ్యతిరేఖ ముఠా ఎవరో అర్థమైంది’’ అని సోషల్ మీడియాలో రిజిజు పోస్ట్ పెట్టారు.
ఇటీవల, ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులపై ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. భారతదేశానికి నిజమైన ప్రధాని ముఖేష్ అంబానీ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ మస్క్ పోస్టుకు స్పందిస్తూ.. ‘‘ఎలాన్ భారతదేశానికి స్వాగతం. ఆ రెండో వ్యక్తి గురించి తెలిసే వరకు ఆగు’’ అంటూ వ్యాఖ్యానించారు. గౌతమ్ అదానీ గురించి రాహుల్ పరోక్షంగా ఈ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతుంది.
Also Read
- CJP: సీజేపీకి బిగ్ షాక్.. దీప్కే, దాస్, రాంకాలకు లుకౌట్ నోటీసులు!
- SEBI: కీలక నిర్ణయం తీసుకున్న సెబీ.. కేవైసీ నిబంధనల్లో మార్పులు..
- Sheikh Hasina: ‘‘హసీనాకు ఏమైనా జరిగితే..’’ బంగ్లాదేశ్ ప్రధానికి మాజీ అమెరికన్ అధికారి హెచ్చరిక!
- Paternity Leave: తమిళనాడులో తండ్రులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు!
మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వ్యతిరేకించడానికీ , భారతదేశ నిర్ణయాలను ప్రశ్నించే హక్కును ఒక విదేశీ వ్యాపారవేత్తకు ఇవ్వడానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఎత్తి చూపారు. మస్క్ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని, ఇకపైన ఉంటారని అన్నారు. అయితే, అంతమాత్రాన ఒక విదేశీ వ్యాపారవేత్త భారత ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించకూడదని అన్నారు.
कभी-कभी असदुद्दीन ओवैसी भारत के राष्ट्रीय हित से जुड़े मुद्दों पर समझदारी बातें करते हैं, हालाँकि हम उनकी कट्टर मुस्लिम-केंद्रित नीतियों का विरोध करते हैं। अगर विपक्ष के कुछ नेता हमारी बात नहीं सुनना चाहते, तो उन्हें ओवैसी से सीखना चाहिए।
Now it’s clear who’re Anti-India gang https://t.co/pS4PDGbq7D
— Kiren Rijiju (@KirenRijiju) October 17, 2026
తాజావార్తలు
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!