భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది.
పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్, ఇర్ఫా వసంత్ అండ్ కో, లంక రాజు, కోటేరు శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి బ్రదర్స్ సహా వ్యాపారస్తులు శేసెట్టి సాంబయ్య, వలసా లింగమూర్తిలను పద్ధతి మార్చుకోవాలంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు. జవ్వాది మున్ని విలేకరి పేరుతో ప్రజలను ఏం మార్చుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, అవును విజయ భాస్కర్ రెడ్డి, ఇందుల బ్రదర్స్.. భూస్వాములకు, పెత్తందారులకు వంత పాడుతున్నారని రాసుకొచ్చారు.
Also Read: Leopard Attacks: దడ పుట్టిస్తున్న పులుల దాడులు.. ఒకేరోజు ముగ్గురిపై దాడి, ఇద్దరు మృతి!
ఇన్ ఫార్మర్లు చాలా మంది భూస్వాములకు, పెత్తందారుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని.. వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని విప్లవ పేరుతో లేఖ విడుదలైంది. బికేఎస్ఆర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ ఉండగా.. విప్లవ పేరుతో లేఖ రావడం కొంత అనుమానాస్పదంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ.. మావోయిస్టుల లేఖతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.