భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్,…