Union Budget 2026: కాంచీవరం చీరలో నిర్మలా సీతారామన్.. 9 బడ్జెట్లు 9 రకాల చీరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026పై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరసగా 9వ సారి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే, నిర్మలమ్మ ఈసారి తన సొంత రాష్ట్రం తమిళనాడుకు చెందిన కాంచీవరం చీరను ధరించారు. చేనేత మోరూన్ కాంచీవరం చీరను ధరించి ఆమె కర్తవ్య భవన్‌కు వచ్చారు. మరోవైపు, మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటం గమనార్హం. తమిళనాడుకు చెందిన కాంచీవరం చీరలకు 2005లో జియో గ్రాఫికల్ ఇంటికేషన్(GI) ట్యాగ్ లభించింది.
Read Also: IND vs PAK U19: సూపర్ సిక్స్‌లో హై వోల్టేజ్ పోరు.. నేడే దాయాదుల పోరు.. వర్షం పడే అవకాశం!
Also Read
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
- PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, 9 రకాల చీరలను ధరించారు. 2025–26ను ప్రవేశపెట్టేటప్పుడు ఆఫ్ వైట్ హ్యాండ్లూమ్ సిల్క్ సారీని ధరించారు. ఇది బీహార్‌కు చెందిన మధుబని కళతో ఉంది.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సమయంలో ఆమె కాంత హ్యండ్‌వర్క్‌తో కూడిన నీలి రంగు టస్సర్ పట్టు చీరను ధరించారు.

2024 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నప్పుడు నిర్మలా సీతారామన్ ఊదా, బంగారు అంచుతో ఉన్న తెలుపు పట్టు చీరను ఎంచుకున్నారు.

2023 బడ్జెట్ సమయంలో కాసూతి హ్యాండ్ వర్క్‌తో కూడిన ఎరుపు, నలుపు రంగు టెంపుల్ బోర్డర్ చీరను ధరించారు. ఇది కసూటి నూలు వర్క్‌తో ఉంది. దక్షిణ భారతీయ సంప్రదాయ శైలిని చూపించింది.

2022 బడ్జెట్ రోజున, ఆఫ్-వైట్ బోర్డర్ తో కూడిన రస్ట్ బ్రౌన్ కలర్, ఒడిశాకు చెందిన బోమ్‌కాయ్ శైలితో ఉన్న చీరను ధరించారు.

2021లో ఇక్కత్ స్టైల్ ఆకుపచ్చ అంచుతో కూడిన ఎరుపు ఆఫ్ వైట్ పట్టు పోచంపల్లి చీరను ధరించి బడ్జెట్ సమర్పించారు.

2020లో నిర్మలా సీతారామన్ కలర్‌ఫుల్ పసుపు-బంగారు వర్ణపు పట్టు చీరతో పార్లమెంట్‌కు వచ్చారు.

2019తో తన మొదటి బడ్జెట్ కోసం ఆమె బంగారు అంచుతో కూడిన సాధారణ గులాబీ రంగు మంగళగిరి చీరను ధరించారు. ఇది ఏపీ హస్తకళా వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

7
తాజావార్తలు
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!