భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టుల హెచ్చరిక లేఖ కలకలం సృష్టిస్తోంది. చర్లలో భూస్వాములు, రాజకీయ నాయకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరిట లేఖ విడుదల అయింది. లేఖ రిలీజ్ కావడంతో మండలంలోని భూస్వాముల్లో, అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. పరుచూరి ప్రేమ్చంద్, పరుచూరి రవికుమార్, జవ్వాది రవికుమార్,…
Karre Gutta: గత ఆరు రోజులుగా కర్రె గుట్టలలో భద్రతా బలగాలు కూబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.. ఈ ఆపరేషన్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దు కర్రె గుట్టలలో భారీ సొరంగాన్ని భద్రతా బలగాలు గుర్తించారు. ఈ సొరంగంలో ఒక ప్రాంతం నుంచి మరో మార్గం ద్వారా బయటికి వెళ్లేందుకు వీలుగా ఉందని భద్రతాదళాలు చెబుతున్నాయి.
ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్ గడ్ సరిహద్దు భద్రాద్రి కొత్త గూడెం జిల్లా చర్ల మండలం చిన్న చెన్నా పురం సమీపంలోని సుక్మా, బీజాపుర్ జిల్లాల అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహోండ్స్ దళాలకు–మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ ఛత్తీస్ గడ్ సరిహద్దులో ఈ ఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం…