Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన క్రీడాకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 290 మంది చనిపోగా.. సుమారు 1000 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో ఘోర రైలు ప్రమాదంగా ఈ విషాదం మిగిలిపోనుంది. బెంగళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్ – చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ గూడ్స్ రైలు శుక్రవారం సాయంత్రం ఢీకొన్నాయి. చాలా బోగీలు పట్టాలు తప్పడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఇంకా సహాయకచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రైలు ప్రమాదంపై క్రీడాకారులు స్పందించారు. ఈ దారుణమైన ఘటనను చూస్తుంటే తీవ్ర వేదన కలుగుతోందని ట్వీట్లు చేశారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మాజీ ప్లేయర్ వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా సహా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.
Also Read : Kottu Satyanarayana: చంద్రబాబు 2014లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
విరాట్ కోహ్లీ: ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌లో ఉన్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ఈ రైలు ప్రమాదం గురించి ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన ఈ విషాదకర ట్రైన్ ప్రమాదం గురించి వినడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు.
Saddened to hear about the tragic train accident in Odisha. My thoughts and prayers go out to the families who lost their loved ones and wishing a speedy recovery to the injured.
— Virat Kohli (@imVkohli) June 3, 2023
Also Read : Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్
వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా స్పందించారు. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇన్వాల్వ్ అయిన విషాదకర రైలు ప్రమాదం తీవ్రమైన వేదన కలిగిస్తోందన్నాడు. తమ ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ సెహ్వాగ్ కోరాడు.
Extremely sad hearing about this tragic train accident involving Coromandel Express in Odisha.
Condolences to all families who have lost their loved ones and prayers for quick recovery of those injured. https://t.co/9foYqHybNa
— Virrender Sehwag (@virendersehwag) June 3, 2023
Also Read : Sonia Gandhi: ఒడిశా రైలు ప్రమాదం అత్యంత విషాదం.. మృతుల కుటుంబాలకు సోనియా సంతాపం
సురేష్ రైనా: ఒడిషా రైలు విషాద ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని రైనా ట్వీట్ చేశారు.
మయాంక్ అగర్వాల్: బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు చూశాక నా హృదయం బద్దలైంది అంటూ మయాంక్ అగర్వాల్ అన్నాడు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. అని మయాంక్ ట్వీట్ చేశాడు.
Also Read : Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
వీవీఎస్ లక్ష్మణ్: ఒడిశాలో రైలు ప్రమాదం దురదృష్టకర ప్రమాదం గురించి తెలిసినప్పటి నుంచి నా మనసును తీవ్రంగా కలిచి వేసిందని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తా.. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నా.. అని క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
యువరాజ్ సింగ్: ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నా అని మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు.
I offer my deepest condolences to the families of all those who lost their life in the #Odisha train mishap 🙏🏻 my prayers for the quick recovery of the injured #CoromandelExpress
— Yuvraj Singh (@YUVSTRONG12) June 2, 2023
సానియా మీర్జా: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం చాలా విషాదకరమైనది.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మాజీ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!