Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్‌కు మొజ్తబా వార్నింగ్..
- నా తండ్రి మరణానికి ప్రతీకారం తప్పకుండా ఉంటుంది..
- అమెరికా, ఇజ్రాయిల్‌లకు వార్నింగ్ ఇచ్చిన మొజ్తబా ఖమేనీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mojtaba Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే, తన తండ్రి హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన కుమారుడు, ప్రస్తుత ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించారు. దాదాపుగా నాలుగు నెలల తర్వాత ఆయన అంత్యక్రియలు ఇటీవల ముగిశాయి. అయితే, అంత్యక్రియల తర్వాత మొజ్తబా ఈ సందేశాన్ని విడుదల చేశారు.
‘‘మా అమర నాయకుడు అలీ ఖమేనీతో పాటు ఈ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి అమరవీరుడి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు’’ అని అమెరికా, ఇజ్రాయిల్‌లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రతీకారం అనేది తప్పకుండా జరుగుతుందని, అది తనపై లేదా ఇతర అధికారులపై ఆధారపడి ఉండదని ఆయన స్పష్టం చేశారు. తాము ఉన్నా లేకపోయినా ఆ రోజు తప్పకుండా వస్తుందని, ప్రతీకారం అనివార్యమని అన్నారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలకు మొజ్తబా ఖమేనీ కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్, ఇరాక్‌లోని టెహ్రాన్, కోమ్, నజాఫ్, కర్బలా, మష్హద్ నగరాల్లో లక్షలాది మంది పాల్గొనడం శత్రువులకు గట్టి సందేశమని ఆయన పేర్కొన్నారు.
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?