Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు.. రుతుపవనాలకు ఏమైంది?..
- దేశంలోని 70-80% ప్రాంతాల్లో వర్ష మేఘాలు మాయం..
- పశ్చిమ పసిఫిక్‌లోని తుఫాను కారణంగా రుతుపవనాలు బలహీనం..
- జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ..
- ఎల్‌నినో ప్రభావాన్ని గమనిస్తున్న వాతావరణ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon 2026: ఈ ఏడాది జూలై నెల మధ్యలోకి వచ్చినా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూలై 11 శనివారం నాటికి దేశంలోని దాదాపు 70-80 శాతం ప్రాంతాలపై మేఘాలు లేకుండా కనిపించాయి. శాటిలైట్ ఇమేజ్‌లలో షాకింగ్ విజువల్స్ కనిపించాయి. చాలా ప్రాంతాల్లో వర్ష మేఘాలు మాయం అయ్యాయి. ఇటీవల భారీ వర్షాలు మహారాష్ట్ర, గుజరాత్‌లను ముంచేత్తాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పొడి వాతావరణం పరిస్థితులు ఏర్పడ్డాయి.
పసిఫిక్ పరిస్థితులే రుతుపవనాలకు దెబ్బ:
వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ, ఎల్నినోగా పిలిచే ఈ వాతావరణ దృగ్విషయం వల్లే రుతుపవనాలు బలహీనపడ్డాయి. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు హిందూ మహాసముద్రం నుంచి వచ్చే తేమగాలులు, అలాగే అల్పపీడన ద్రోణి (Monsoon Trough) ఆధారంగా వర్షాలు కురిపిస్తాయి. ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్‌లో ఏర్పడిన బలమైన ఉష్ణమండల తుఫాను కారణంగా తేమగాలులు ఆ ప్రాంతం వైపు మళ్లాయి. దీంతో భారతదేశంలో వర్షలోటు కనిపిస్తోంది.
Also Read
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
- Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
రాబోయే కొద్ది రోజులలో మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుందని భారత వాతవారణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు మళ్లీ అనుకూలించినప్పుడే విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
బలహీన రుతుపవనాలు:
2026 నైరుతి రుతుపవనాలు సాధారణంగా షెడ్యూల్‌తో పోలిస్తే ఒక రోజు ఆలస్యంగా జూలై 9న దేశం మొత్తం ఆవరించాయి. జూన్ నెల ముగిసే సమయానికి భారతదేశంలో 40 శాతం వర్షపాత లోటు ఉంది. ఇటీవల సంవత్సరాల్లో ఇదే అత్యంత బలహీనమైన రుతుపవనకాలం. జూన్ చివరి రోజులు, జూలై మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలు వర్షపాత లోటును గణనీయంగా తగ్గించి, దేశవ్యాప్త లోటును సుమారు 14 శాతానికి చేరింది. అయితే, ఈ వర్షాలు పశ్చిమ, తూర్పు భారత్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవగా, దేశ మధ్య భాగంలో గణనీయమైన వర్షపాత లోటు ఏర్పడింది.
ఐఎండీ ఏం చెబుతోంది..?
జూలై లో కూడా వర్షపాత దీర్ఘకాల సగటు కన్నా తక్కువగా ఉంటుందని, నెలవారీ వర్షపాతం సాధారణం కన్నా 94 శాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో పసిఫిక్‌లో ఎల్‌నినో పరిస్థితుల్ని గమనిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి భారతదేశ రుతుపవనాలు పూర్తిగా కనుమరుగు కాలేదు కానీ, బలహీనదశలోకి ప్రవేశించాయి. రాబోయే రోజుల్లో పసిఫిక్ వాతావరణ వ్యవస్థపై రుతుపవనాలు ఆధారపడి ఉన్నాయి.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?