ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డ్స్ ఆపద్భాందవుడిలా ఆదుకుంటుండడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు శాలరీతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి వద్ద మహా అయితే ఓ 10 లేదా 20 క్రెడిట్ కార్డులు వాడుతారు కావొచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను వాడి వాడకం అంటే ఏంటో నిరూపించాడు. అసలు క్రెడిట్ కార్డులు వాడితే గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కుతారని ఎవరైనా ఆలోచించారా? ఇది నిజమేనండి బాబు.
Also Read:Kishan Reddy : కొత్త మొబైల్ యాప్‌తో పత్తి సేకరణలో రద్దీకి చెక్
ఓ వ్యక్తి 1638 క్రెడిట్ కార్డులు వాడి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. అతను మరెవరో కాదు తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన మనీష్ ధమేజా. వ్యాలిడ్ క్రెడిట్ కార్డులు కలిగి ఉడడంతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదైంది. రెండు మూడు క్రెడిట్ కార్డుల బిల్లులు పే చేయలేక సతమతమవుతుంటే ఇన్ని కార్డులు ఎలా మెయిన్ టైన్ చేస్తున్నాడండి బాబు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. క్రెడిట్ స్కోర్ సమస్యతో క్రెడిట్ కార్డు పొందలేక పోతున్న యువత మనీష్ ధమేజా 1638 క్రెడిట్ కార్డులు కలిగి ఉండడంతో షాక్ కు గురవుతున్నారు. తనకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని మనీష్ ధామేజా తెలిపాడు.
మనీష్ ధామేజా మాట్లాడుతూ.. క్రెడిట్ కార్డులు నా జీవితంలో ఒక పెద్ద భాగం. “క్రెడిట్ కార్డులు లేకుండా నా జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. నాకు క్రెడిట్ కార్డులు అంటే చాలా ఇష్టం. నేను కాంప్లిమెంటరీ ట్రావెలింగ్, రైల్వే లాంజ్, విమానాశ్రయ లాంజ్, ఆహారం, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ దేశీయ విమాన టిక్కెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టిక్కెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ ఫ్యుయల్ మొదలైన వాటి మైలురాయిని చేరుకోవడం ద్వారా, రివార్డ్ పాయింట్లు, ఎయిర్‌మైల్స్, క్యాష్‌బ్యాక్‌ని పొందానని తెలిపాడు.
Also Read:Vijay Deverakonda : ‘రౌడీ జనార్దన’.. మొదలెట్టనున్న కొండన్న.. ముహుర్తం ఎప్పుడంటే
2016 నవంబర్ 8న, భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ సిరీస్‌లోని అన్ని 500 రూపాయలు, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత ప్రభుత్వ ఈ నిర్ణయం భారతదేశంలో తీవ్ర భయాందోళనలను సృష్టించింది. ప్రతి ఒక్కరూ కొత్త కరెన్సీ కోసం బ్యాంకు ముందు పెద్ద క్యూలో వేచి ఉన్నారు. ఆ సమయంలో క్రెడిట్ కార్డ్ నా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. నేను బ్యాంకులో నగదు కోసం తొందరపడాల్సిన అవసరం రాలేదు. క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్‌గా డబ్బు ఖర్చు చేయడం సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.