టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే పనులు ఎవరు చేసినా యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.
పార్టీలో డిసిప్లెన్ ఉండాలని, పొరపాటున కూడా పార్టీ డ్యామేజ్ అయ్యే పనులు ఎవరు చేయకూడదని ఆయన సూచించారు. అంతేకాకుండా.. కర్ణాటకలో కష్టపడి గెలిచామన్న మాణిక్ రావ్.. తెలంగాణలో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ కి మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడని, బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Jewish Wedding: 15 ఏళ్ల తర్వాత కేరళలో యూదు జంట పెళ్లి.. 70ఏళ్లలో ఇది ఐదవది
కేసీఆర్, బీజేపీ తెరచాటు స్నేహాన్ని ప్రజలకి వివరించాలని, రాష్ట్రంలోని సమస్యలపై అన్ని స్థాయిల్లో పోరాట కార్యక్రమాలు ఉండాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, ఎన్నికలకు అందరూ సిద్దంగా ఉండాలన్నారు. మీడియాలో మనల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వస్తాయని, వాటిని పట్టించుకోవద్దని ఆయన సూచించారు. వీటితో పాటు ‘కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. పార్టీ పదవుల్లో ఉండి పని చేయని వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. బాధ్యత ఇచ్చిన తర్వాత పని చేయలేకపోతే…పని చేయలేమని చెప్పేయండి. బాధ్యతలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదు. పని చేయని వారిని పక్కన పెట్టేద్దాం. కష్టపడ్డ వారికే టికెట్లు వస్తాయి. సర్వేల ఆధారంగా టికెట్ల వస్తాయి. పరిచయాలు ఉన్నంత మాత్రానా టికెట్లు రావు.’ అని ఆయన పేర్కొన్నారు.
Train Reverse : స్టేషన్ మర్చిపోయిన లోకో ఫైలట్.. ట్రైన్ రివర్స్ తిప్పేశాడు