Mandous Cyclone : కర్ణాటకలో మాండూస్ ఎఫెక్ట్.. బెంగళూరుకు ఎల్లో అలర్ట్
Mandous Cyclone : మాండూస్ తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజులుగా వానలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నిన్నటి వరకు తుఫాన్ ప్రభావం తక్కువగా కనిపించినప్పటికీ.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బెంగుళూరు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం తమిళనాడు తీరం దాటిన మాండూస్ తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాకింది. ఇదే సమయంలో కర్ణాటకలోని అనేక జిల్లాల్లో వర్షం పడుతోంది. శివమొగ్గ, హావేరి, బళ్లారి, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కోలారు, మైసూరు, బాగల్ కోటే, రాయచూరు విజయపుర, యాదగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.
Read Also: Konda Surekha : టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
Also Read
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..
- KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
బెంగళూరు, హాసన్, కొడుకు జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీబీఎంపీ అధికారులు మనవి చేశారు. డిసెంబర్ 12 వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఆకాశం మేఘావృతంగా ఉంటుందన్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. శనివారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలయమం కావడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తుఫాన్ దాటికి తమిళనాడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
RR vs SRH: ఫస్ట్ టైమ్ టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Jio New Plan: జియో చవకైన గేమింగ్ ప్లాన్.. సూపర్ బెనిఫిట్స్.. ధర ఎంతంటే?
-
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
-
Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
-
Beetroot Stains : బీట్‌రూట్ మరకలకు బై బై..! ఈ మ్యాజిక్ ట్రిక్ తెలుసా.?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!