Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు దూసుకొస్తుంది.. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది.. అందులో భాగంగా.. రేపు, ఎల్లుండి అంటే మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.. తుఫాన్ హెచ్చిరకల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తలో భాగంగా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు మంగళవారం, బుధవారం అధికారులు సెలవులు ప్రకటించారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
ఇక, అర్నబ్ తుఫాన్ కారణంగా కాకినాడ జిల్లాలో తీర ప్రాంతంలో ఉన్న 80 వేలు మందిని అప్రమత్తం చేశారు.. వారికోసం ప్రత్యేకంగా 101 కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు… తీర ప్రాంతంలో ఉన్న ఆరు మండలాల తో పాటు, మరో ఐదు మండలాలలో భారీ వర్షాలు ఈదురు గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు… ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రద్దు చేశారు కలెక్టర్..
Also Read
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. గంటకు 140 కి.మీ. వేగంతో గాలులు! 15 జిల్లాలకు భారీ వర్ష సూచన
- Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
- CM Chandrababu : అర్నబ్ తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష
- AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
అయితే, అర్నాబ్ తుఫాను కారణంగా కోనసీమ, కాకినాడ జిల్లాలకు పెనుముప్పు పొంచి ఉంది… సముద్రం అల్లకల్లోలంగా మారింది .. ఇప్పటికే తీరం దగ్గర అలలు ఉధృతి పెరిగింది.. ఇక, తుఫాన్ తీరం దాటే సమయంలో 2.5 మీటర్ల ఎత్తున ఉప్పెన సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.. గరిష్టంగా 140 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.. ఈ సమయంలో కుంభవృష్టిగా వర్షాలు కురవనున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని అధికారులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.. కాకినాడ జిల్లాకి ఒక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు..
తాజావార్తలు
-
Paras Dogra: అత్యధిక రంజీ మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్.. రికార్డు స్పష్టించిన పరాస్ డోగ్రా..
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!