Mandous Cyclone : మాండూస్ తుఫాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు రోజులుగా వానలు కురుస్తున్నాయి. కర్ణాటకలో నిన్నటి వరకు తుఫాన్ ప్రభావం తక్కువగా కనిపించినప్పటికీ.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బెంగుళూరు నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం తమిళనాడు తీరం దాటిన మాండూస్ తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాకింది. ఇదే సమయంలో కర్ణాటకలోని అనేక జిల్లాల్లో వర్షం పడుతోంది. శివమొగ్గ, హావేరి, బళ్లారి, చిక్కమగళూరు, చిత్రదుర్గ జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. కోలారు, మైసూరు, బాగల్ కోటే, రాయచూరు విజయపుర, యాదగిరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.
Read Also: Konda Surekha : టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ రాజీనామా
బెంగళూరు, హాసన్, కొడుకు జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. బెంగళూరు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీబీఎంపీ అధికారులు మనవి చేశారు. డిసెంబర్ 12 వరకు ఉరుములు, మెరుపులతో పాటు ఆకాశం మేఘావృతంగా ఉంటుందన్నారు. బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు. శనివారం కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలయమం కావడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. తుఫాన్ దాటికి తమిళనాడులో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.