Lavanya Tripathi as Sati Lilavati: వైవిధ్యమైన ప్రాతలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత.. మళ్లీ తన కెరీర్ ను రీస్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కనపడుతోంది. నేడు తన 34వ పుట్టిన రోజు సందర్భంగా లావణ్య “సతి లీలావతి” అనే కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాలో లావణ్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ నిర్మించనున్నాయి. పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న మొదటి సినిమా కావడంతో ప్రేక్షకులు దీనిని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Varun Tej Wishes Lavanya Tripathi: హ్యాపీ బర్త్‌డే బేబీ! అంటూ భార్యకు విషెస్ చెప్పిన వరుణ్ తేజ్
Extremely excited to be a part of this project! This story caught my attention with its amazing write-up and solid team. I’m thrilled to be starting this next year
what a fantastic way to kick off the year!
.
.#tatinenisatya @MickeyJMeyer
#binendramenon #kosanamvithal… pic.twitter.com/D0KIddRreI— Lavanyaa konidela tripathhi (@Itslavanya) December 15, 2024
ఇక మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నవంబర్ 1, 2023న మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ఏడడుగులు వేసింది లావణ్య త్రిపాఠి. ఇక తాను నటిచనున్న తాజా చిత్రం సంబంధించిన విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ.. పెళ్లి తర్వాత తన కెరీర్‌కు ఈ సినిమా కొత్త మలుపు తీసుకోబోతుందని, “సతి లీలావతి” సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అందించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. ఇక పెళ్లి తరువాత సినిమాలను పూర్తిగా మానేస్తుందన్న పుకార్లకు చెక్ పెడుతూ సరికొత్త సినిమాను ప్రకటించింది లావణ్య.