Manchu Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లాయి. అయితే, తాజాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన ‘మిరాయ్’ సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విషెస్ అందించాడు. అయితే, దానికి మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు.
READ MORE: Teja Sajja : తేజసజ్జా.. ఆ హీరోల లిస్టులో చేరిపోయినట్టే
“థాంక్యూ అన్న” అని పేర్కొంటూ ‘మిరాయ్’ సినిమా టీం తరపున థాంక్స్ చెబుతున్నట్టు, అలాగే ఆ సినిమాలో తన పాత్ర బ్లాక్ స్వర్డ్ తరపున కూడా థాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో మంచు ఫ్యామిలీలో మంచు బ్రదర్స్ మధ్య ఏర్పడిన వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇక తేజ హీరోగా నటించిన ‘మిరాయ్’ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగుతోపాటు పాన్ వరల్డ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని భాషలలోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సంచలన వసూళ్ల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది.