Manchu Manoj: గత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లాయి. అయితే, తాజాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించిన 'మిరాయ్' సినిమా రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విషెస్ అందించాడు. అయితే, దానికి మంచు మనోజ్ ఆసక్తికరంగా స్పందించాడు.
Manchu Manoj : మంచు ఫ్యామిలీలో వివాదాలకు ముగింపు పలికినట్టేనా.. ఈ మధ్య ఎలాంటి గొడవలు పెద్దగా బయటకు కనిపించట్లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భైరవం, కన్నప్ప సినిమాల నుంచే అంతా సైలెంట్ అయిపోయారు. అంతకు ముందు మనోజ్ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి నానా రచ్చ చేశారు. మోహన్ బాబు, విష్ణు కూడా వరుస స్టేట్ మెంట్లు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలాంటివేమీ కనిపించట్లేదు. కన్నప్ప సినిమాను చూసి మరీ మనోజ్ విష్ణు నటనను మెచ్చుకున్నాడు.…