మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. చిరంజీవిని స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి కట్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే సినిమాపై అంచనాలు పెంచడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ సాంగ్స్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ అభిమానుల్లో జోష్ నింపింది.
Also Read : Star Hero : ఒక్క సినిమాకు రూ. 225 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో
ఇక ఇటీవల తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించిన ఈవెంట్ లో ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. చిరు కామెడీ టైమింగ్ కు తోడు అనిల్ రావిపూడి మార్క్ రైటింగ్ డైలాగ్స్ నవ్వులు పూయించాయి. అలానే ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎంట్రీ హైలెట్ అని చెప్పాలి. ఏదేమైనా ఈ సంక్రాంతికి చిరు – వెంకీ చిందేసేందుకు రెడీగా ఉన్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. అందుకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు చిరు, వెంకీ కలిసి చిందేయబోతున్నారు. అలాగే చిత్ర యూనిట్ మొత్తం ఈ వేడుకకు హాజరుకాబోతుంది. జనవరి 12న సినిమా రిలీజ్ కాబోతున్న మన శంకర వర ప్రసాద్ గారు’ ఒకరోజు ముందుగా అనగా జనవరి 11న ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.