Lakshmi Elephant : దేవాలయాల్లో ఉండే ఏనుగులు చాలా ప్రత్యేకమైనవి. ఆలయంలో దేవుడిని ఎంత భక్తితో భక్తులు కొలుస్తారో.. ఆ దేవాలయ ఏనుగులకు అంతే ప్రాధాన్యం ఇస్తారు. దేవాలయానికి చెందిన ఏనుగులు మృతి చెందితే సంప్రదాయబద్ధంగా వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పుదుచ్చేరిలోని మణకుళ వినాయక ఆలయంలోని ‘లక్ష్మీ’అనే ఏనుగు మృతి చెందింది. లక్ష్మీని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. లక్ష్మితో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో తమిళిసై స్వయంగా పుదుచ్చేరి మణకుళ వినాయక ఆలయానికి వెళ్లి లక్ష్మికి నివాళులు అర్పించారు.
Read Also: ICC: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. బౌలర్ జాబితాలో లేని టీమిండియా ఆటగాళ్లు
1997లో ఓ సంస్థ ఆలయానికి ఐదేళ్ల వయసున్న ఏనుగును కానుకగా ఇచ్చింది. ఆలయ నిర్వాహకులు ఆ ఏనుగుకు లక్ష్మి అని పేరుపెట్టి సాకారు. ఆ ఏనుగు పెద్దయ్యాక వినాయకస్వామి అనుగ్రహంగా భావించి భక్తులు ఆ ఏనుగును కొలిచేవారు. గత 25 ఏళ్లుగా ఆలయ వేడుకల్లో ఏనుగుది ప్రత్యేక స్థానమే. బుధవారం లక్ష్మి రోజూలాగే కామాక్షి అమ్మవారి ఆలయ వీధిలో నడిపించుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో దిగ్ర్భాంతి చెందిన మావటి వెటర్నరీ వైద్యులకు, ఆలయ అధికారులకు సమాచారమిచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న వెటర్నరీ వైద్యులు పరిశీలించి అప్పటికే ఆ ఏనుగు మృతి చెందినట్లు ప్రకటించారు.
Read Also: Gujarat Polls: సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఈ విషయం తెలుసుకుని స్థానికులు ఆ ఏనుగు కళేబరం వద్ద నిలిచి కంటతడిపెట్టుకున్నారు. ఏనుగు మృతి వార్త తెలుసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన మణకుల వినాయక ఆలయానికి చేరుకుని ఏనుగు కళేబరానికి నివాళులర్పించారు. ఏనుగు లక్ష్మి ఆకస్మిక మృతిపై సమగ్ర విచారణ జరపాలని మాజీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. లక్ష్మికి స్థానికులు జేవీఎస్ నగర్‌లో అంత్యక్రియలు జరిపించారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన వారితో పుదుచ్చేరి వీధులు కిటకిటలాడాయి. లక్ష్మి మృతి కారణంగా మణకుల వినాయక ఆలయాన్ని బుధవారం మూసివేశారు.
Lakshmi, the much loved resident Temple elephant at Arulmigu Manakula Vinayagar Pondicherry passed away yesterday. Her Mahout is inconsolable. Only in Sanatan Dharm such remarkable bonds exist between humans and animals…Om Shanti 🙏 pic.twitter.com/XsJUUjvWYg
— Vertigo_Warrior (@VertigoWarrior) December 1, 2022
Puducherry | A large number of people, including Lt Governor Tamilisai Soundararajan paid tributes to Lakshmi, the 32-year-old temple elephant of Sri Manakula Vinayagar Temple who passed away today
Lakshmi suddenly collapsed during a walk today on the temple road and passed away pic.twitter.com/XlIS3bnWby
— ANI (@ANI) November 30, 2022