మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” సంక్రాంతి విజేతగా నిలిచింది. థియేటర్లలో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా, రికార్డు స్థాయి వసూళ్లతో సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. మెగాస్టార్ ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నేడు థియేటర్లను సందర్శించి ప్రేక్షకులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకుంది. కాగా..
Also Read : Sara Arjun : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న ‘ధురంధర్’ భామ..
తాజా షెడ్యూల్ ప్రకారం, చిత్ర బృందం ఈరోజు ఏలూరు, గణపవరం, తణుకు, రావులపాలెం.. రాజమండ్రిలోని ప్రధాన థియేటర్లను సందర్శించనుంది. ఈ ఆఫ్-లైన్ ప్రమోషన్లతో సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుందని, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో మెగా ఫ్యాన్స్ హంగామాతో థియేటర్లు కళకళలాడుతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించారు. భావోద్వేగ సన్నివేశాలు, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సీజన్లో మెగాస్టార్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది.