blood donation improves skin ageing: మనం చర్మ సౌందర్యం కోసం ఎన్నో రకాల కాస్మోటిక్స్ ఉపయోగిస్తుంటాము. మనం అందంగా కనిపించేందుకు పలు రకాల క్రీమలు వాడుతూ సౌందర్యాన్ని పెంచుకునేందుకు పైసలు నీరులా ఖర్చుపెడుతుంటాము. అందంగా ఉండేందుకు డైటింగ్, నానా రకాల పదార్థాలు చేస్తుంటారు. అయితే శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇలాంటి ఏవీ ఉపయోగించుకుండానే మనం అందంగా ముడతలు లేని చర్మాన్ని మన సొంతం చేసుకోవచ్చంటున్నారు. అలా ఎలా అంటారా? చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే రక్తాన్ని దానం చేయండి. అదేంటీ రక్తం దానం చేస్తే చర్మ సౌందర్యం పెరుగుతుందా పిచ్చా అనుకుంటున్నారా? నిజమండి. రక్తదానం చేయడం వలన చర్మ సౌందర్యం పెరగడమే కాకుండా అందంగా ఆకర్షినీయంగా ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతేకాదు. చర్మంలో ఏజ్ పెరిగే కొద్ది వచ్చే ముడతల నుంచి కూడా విముక్తి పొందచ్చు.
Read also: Kamareddy Master Plan: కామారెడ్డిలో ఉద్రిక్తత.. షబ్బీర్ అలీ సహా 100 మంది అరెస్ట్
చర్మ సౌందర్యానికి కాస్మొటిక్ వాడి చర్మం ముడతలు డల్ గా చిన్న వయస్సులోనే ముడతలు రావడం జరగుతుంటుంది. అయితే దీని వల్ల ముఖం సౌందర్యంలో మార్పులు వస్తుంటాయి. ఫేస్ క్రీములు వాడి ముఖం కూడా మందంగా మొద్దుబారిపోయి డల్ గా ఉంటుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని మీ రక్తాన్ని దానం చేయడం ఇలా చేస్తే సౌందర్యం ఎలా పెరుగుతుంది అనుకుంటున్నారా? రక్తాన్ని దానం చేయటం వల్ల చర్మం మందం, చర్మం పైపొర కింద ఉండే కొలాజెన్ మోతాదు పెరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రక్తం దానం చేయడం వల్ల చర్మం ముడతలు పడటానికి కారణమయ్యే మార్గాలు గణనీయంగా మారుతాయని తేలింది. అంతేకాదండోయ్ వాపు ప్రక్రియతో ముడిపడిన జన్యువుల వ్యక్తీకరణ తగ్గుతుండగా.. కొలాజెన్‌తో ముడిపడిన జన్యు వ్యక్తీకరణ ఎక్కువ అవుతుంది. దీనికి గల కారణం వృద్ధాప్య ఛాయలు త్వరగా ముంచుకురాకుండా చూపేవే.. రక్తదానంతో ఐరన్ నిల్వలు తగ్గతాయట అంతేకాదు.. ఇది చర్మ సౌందర్యం ఇనుమడించటానికి తోడ్పడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక.. ఐరన్ నిల్వ మరీ ఎక్కువైతే వృద్ధాప్య ప్రక్రియ పుంజు కుంటుందని..ఇది వయసుతో పాటు ముంచుకొచ్చే సమస్యలకూ దారితీస్తుందని చెబుతున్నారు.
Same Stage: ఒకే వేదికపై మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి