Samantha: ఊహించని పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టిన సామ్.. ఇక ఆగేదేలే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha to join Allu Arjun in Atlee’s next Film: ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత సరైన సాలిడ్ ప్రాజెక్ట్ ఏది చేయలేదు. ఆమె సినిమాల్లో నటిస్తోంది కానీ సరైన హిట్టు పడడం లేదు. ఒక వెబ్ సిరీస్ చేసింది అందులో ఆమె నటనకు ప్రశంసలు తగ్గాయి కానీ ఎందుకో పూర్తి స్థాయిలో ఆమెకు అది సంతృప్తిని ఇవ్వలేదేమో అనిపిస్తోంది. ఇప్పుడు మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడి దాని నుంచి తప్పించుకుని మరోసారి నటన మీద ఫోకస్ పెడుతున్న ఆమెకు ఒక బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తోంది. అదేమిటో కాదు అల్లు అర్జున్ ప్రస్తుతానికి పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే అట్లీ దర్శకత్వంలో క్షమా చేయబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2024వ సంవత్సరంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన కథ లాక్ అయిందని అట్లీ చెప్పిన కథకి బన్నీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని తెలుస్తోంది.
Ruhani Sharma: హేయ్ రుహానీ, నువ్వేనా.. ఇంత దారుణమైన సీన్‌లో దర్శనమిచ్చావ్ఏంటి?
Also Read
దీంతో ఈ సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటినటులు, టెక్నీషియన్లను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు అట్లీ. అందులో భాగంగానే సమంత ఈ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ సమంత కలిసి తేరి అనే సినిమా చేశారు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ కూడా అయింది. ఇక సమంతకి కథ చెబితే ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా అధికారిక ప్రకటన చేసి సినిమా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక పుష్పా లాంటి సినిమా తర్వాత అల్లు అర్జున్తో సినిమా పడితే సమంత క్రేజ్ మరో లెవల్ కి వెళ్లడం ఖాయం అని చెప్పొచ్చు. నేషనల్ లెవెల్ లో మెరిసిపోవాలని చూస్తున్నా ఆమెకు ఇది సరైన అవకాశం అని చెబుతున్నారు. ఎందుకంటే ఒకపక్క పుష్ప సినిమాతో నార్త్ లో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక జవాన్ లాంటి సినిమా చేయడంతో అట్లీకి కూడా దాదాపు అలాంటి క్రేజ్ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో సమంత సినిమా చేస్తే ఆమెకి నార్త్ లో బాగా కలిసి వస్తుందని అంటున్నారు.
- Tags
- Allu Arjun
- Atlee
- Samantha
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!