Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Man Performs Bike Stunt With Firecrackers In Tamil Nadu

Firecrackers on Bike: బైక్‌పై టపాసులు కాల్చుడేంటి..? ఆ స్టంట్స్‌ ఏంటి..? దూలతీరిందా..?

Published Date :November 14, 2023 , 11:57 am
By Sudhakar Ravula
Firecrackers on Bike: బైక్‌పై టపాసులు కాల్చుడేంటి..? ఆ స్టంట్స్‌ ఏంటి..? దూలతీరిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Firecrackers on Bike: దీపావళి వచ్చిందంటే చాలు.. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతారు.. కుటుంబ సభ్యులంతా కలిసి ఉత్సాహంగా టపాసులు పేలుస్తుంటారు.. అయితే, కొందరు యువకులు టపాసులతోనూ విచిత్రమైన వేషాలు వేస్తున్న ఘటనలు కొన్ని చూస్తూనే ఉన్నాం.. ఈ మధ్యే టైగర్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్స్‌ బాణాసంచా కాల్చి.. ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేసిన ఘటన మరువక ముందే.. కొందరు యువకులు బైక్‌పై డేంజర్స్‌ స్టంట్స్‌ చేయడమే కాదు.. ఆ స్టంట్స్‌లో బాణాసంచా కాల్చుతూ.. దారిన పోయేవారికి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు.. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు..

Read Also: Animal Song: నాన్నకు ప్రేమతో… ఏ సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్

రోడ్డుపై వెళ్తూ బైక్‌పై స్టంట్స్‌ చేస్తేనే.. వెనుక.. ముందు వెళ్లే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది.. అంతేకాదు.. అదుపుతప్పితే ప్రమాదాలు కూడా కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.. అయితే.. ఓ యువకుడు తన బైక్‌కు ముందు ఉన్న లైట్‌ భాగంలో టపాసులను అమర్చాడు. ఇక, ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టి.. రోడ్డుపై వేగంగా దూసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా.. బైక్‌ ముందు టైర్లను గాల్లోకి లేపి ప్రమాదకర స్టంట్స్‌ చేశాడు. బైక్‌పై స్టంట్స్‌ చేస్తూ.. బాణాసంచా కాల్చుతూ.. ఆనందం పొందాడేమో.. కానీ, అది ఇతరులకు ఇబ్బందిగా మారింది.. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాకు ఎక్కి వైరల్‌గా మారిపోయింది.. రంగంలోకి దిగిన తమిళనాడులోని తిరుచ్చి పోలీసులు.. ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. మరోవైపు.. గురుగ్రామ్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది.. ఓ వ్యక్తి కారు పైకప్పుపై పటాకులు కాలుస్తూ.. సైబర్‌ సిటీ ప్రాంతంలో హల్‌చల్‌ చేశాడు.. ఈ దృశ్యాలుకూడా సోషల్ మీడియాకు ఎక్కాయి.. ఆ వీడియోపై స్పందించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీపావళి అంటే ఆనందంగా జరుపుకోవాలి.. ఇలాంటి పైశాచిక ఆనందం దేనికి.. ఊచలు లెక్కపెట్టడం దేనికోసం.. దూల తీరిందా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

இன்னொன்னு 🤬 https://t.co/DPmRpBiG8Z pic.twitter.com/UEoAucEpaX

— 𝗟 𝗼 𝗹 𝗹 𝘂 𝗯 𝗲 𝗲 (@Lollubee) November 12, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bike
  • bike stunt
  • car
  • FireCrackers
  • Firecrackers on Bike

తాజావార్తలు

  • Stock Market: కాసుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.16 లక్షల కోట్ల లాభాలు!

  • dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!

  • TVK Chief Vijay: టీవీకే విజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ పార్టీ మనతోనే..!

  • Jowar Ambali Recipe: ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే హెల్తీ, టేస్టీ డ్రింక్.. పాత పద్దతిలో జొన్న అంబలి..

  • YS Jagan Padayatra: వచ్చే సంవత్సరం నా పాదయాత్ర.. ఇక, చంద్రబాబుకి ప్రతిరోజూ సినిమా చూపిస్తాం..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions