Vinukonda Crime: ఆంధ్రప్రదేశ్‌లో ఓ వ్యక్తిని నడిరోడ్డుపై నరికివేశాడో యువకుడు.. ఈ ఘటన పల్నాడు జిల్లా వినుకొండలో చోటు చేసుకుంది. పట్టణంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేయడం తీవ్ర కలకలం సంచలనం కలిగించింది.. వ్యక్తిగత కక్షలతో రషీద్ అనే వ్యక్తిపై జిలాని అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.. చేతులపై, మెడపై, తలపై ఇలా విచక్షణా రహితంగా దాడి చేస్తూ.. ప్రాణం పోయే వరకు నరికి హత్య చేశాడు… అయితే దాడి చేస్తుంటే, కనీసం రోడ్డుపై వెళ్లేవారు కానీ, స్థానికులు కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.. దీంతో అందరూ చూస్తోందగానే రషీద్ అనే వ్యక్తి ప్రాణం కోల్పోయాడు.. ఇక, స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సీరియస్‌గా స్పందించారు.
Read Also: CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం.. నేడు శాంతిభద్రతలపై
నడిరోడ్డుపై హత్యా ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ.. రషీద్ అనే వ్యక్తి ని జిలాని అనే యువకుడు నరికి హత్య చేశాడన్నారు.. ఈ హత్యకు కారణం ఇద్దరికి వ్యక్తిగత ఘర్షణలు ఉన్నాయని.. దీనిలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేదని సృష్టం చేశారు జిల్లా ఎస్పీ.. వినుకొండలో జరిగిన దారుణ హత్య నేపథ్యంలో, పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నాం అని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు ఎస్పీ శ్రీనివాసరావు.