Dance : ఈ రోజుల్లో డ్యాన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి వేడుకలోనో, మరేదైనా ఫంక్షన్లోనో చిన్నప్పటి నుంచి పెద్దల వరకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. ఒక్కోసారి వాళ్ల డ్యాన్స్ చూసి నవ్వుకుంటారు, ఇంకొందరు బాగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. అలాంటి వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి కంగుతింటున్నారు.
Read Also: Relationship: కాసులు కాదు కావాల్సింది.. కాస్తంత ప్రేముంటే చాలు
ఈ వీడియోలో ఓ వృద్ధుడు బాట్ల హౌస్ సినిమాలోని ‘సాకి-సాకి’ పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, ఆ పాటకు ఓ అంకుల్ చాలా ఇంటెన్స్‌గా కూల్‌గా డ్యాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. అతడి లుక్, నడుము తిప్పడం.. హావభావాలు నోరా ఫతేహి డ్యాన్స్ ను మైమరిపించేశాయి. వివిధ రకాల డ్యాన్స్‌లను చూశాం.. కానీ, కాకా ఇంత కూల్ స్టైల్‌లో డ్యాన్స్ చేయడం చాలా అరుదు.. పిచ్చెక్కించేశాడు.
Read Also: Amit Shah: ఇండియన్ సినిమాకు ఇదో చారిత్రాత్మక రోజు.. ఆర్ఆర్ఆర్ టీమ్‌కి అమిత్ షా శుభాకాంక్షలు
ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు ఒక మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. లక్ష 7 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. వీడియోను చూసిన ఒకరు సరదాగా ‘ఈయన నోరా ఫతేహీ తండ్రి’ అని అంటుంటే, ‘డాన్స్‌కి వయసు లేదు’ అని మరొకరు అంటున్నారు. అంకుల్ డ్యాన్స్ బాగా చేశాడు. అదేవిధంగా, మరొక వినియోగదారు “ఇప్పుడు నోరా ఫతేహి అవసరం లేదు, ఎందుకంటే నోరా ఫతేహి 2.0 మన దేశంలో కనుగొనబడింది. ఇప్పుడు ఆమె డ్యాన్స్ ప్రమాదంలో పడింది అంటూ కామెంట్లు చేశారు.