COVID19: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా మహమ్మారి. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పొయారు. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలా మంది చనిపోయారు. తక్కువ శాతం మంది మాత్రమే కోలుకొని ఇంటికి తిరిగివచ్చారు. అయితే కోలుకున్న వారిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) జరిపిన సర్వేలే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ తాజాగా ఓ పరిశోధనా పత్రాన్ని విడుదల చేసింది. కాగా ఇండియన్ మెడికల్ జర్నల్ ఈ రీసెర్చ్ రిపోర్టును ప్రచురించింది. దానిలో ఉన్న వివరాల ప్రకారం ఆసుపత్రులలో చేరి కోలుకున్న 14,419 మంది కరోనా రోగులను ఈ సర్వేలో పరీక్షించారు. వారిని నాలుగు వారాల నుంచి ఏడాది పాటు ఐసీఎంఆర్ నిపుణులు పరిశీలించారు. అయితే ఇక్కడే వారికి ఓ షాకింగ్ విషయం తెలిసింది.
Also Read: Sony Xperia 5 V: మార్కెట్లోకి రానున్న సోనీ ఎక్స్ పీరియా 5 వీ.. ఫీచర్లు ఇవే
ఈ పరిశోధన ఫలితంగా డిశార్జ్ అయ్యి ఇంటికి చేరిన వారిలో 942 మంది అంటే 6.5% మంది ఏడాదిలోపే చనిపోయినట్లుగా తెలిసింది. అంటే సగటున ఆసుపత్రి నుంచి డిశార్జ్ అయిన 28 రోజులకు చనిపోయినట్లుగా గుర్తించినట్లు ఐసీఎంఆర్ రిపోర్ట్ పేర్కొంది.అయితే ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన వారిలో 27.4 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా అయినా తీసుకున్న వారేనని వెల్లడించింది. ఇక దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడుతున్న వారే చనిపోయిన వారిలో 73 శాతం మంది ఉన్నారని రిపోర్ట్ వివరాల బట్టి చూస్తే అర్థం అవుతుంది. దీనిని బట్టి పరిశీలిస్తే కరోనా నుంచి బయట పడినా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఎక్కువ ముప్పు ఉందని అర్థం చేసుకోవచ్చు. అందుకే కరోనా నుంచి బయట పడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి. ఇదిలా వుండగా వైరస్ బారిన పడకముందే కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ప్రాణాపాయం కొంత తగ్గే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పరిశోధకులు తెలిపారు.ఇక కరోనా మహమ్మారి కారణంగా చైనాలో రెండు నెలల్లో 20 లక్షల మంది మరణించారనే వార్త ఇటీవల కాలంలో తీవ్ర ఆవేదనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తుంది. తాజా కరోనా వైరస్ కొత్త వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. కరోనా డేటాను ఇవ్వాలని కూడా ప్రపంచ దేశాలను కోరుతుంది.