Urinating On Train Track: ఢిల్లీ మెట్రో స్టేషన్లో రైలు ట్రాక్‌లపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఛీ.. అంటూ అసహ్యించుకుంటున్నారు. సభ్యత, సంస్కారం లేదా అతనికి అంటూ మండిపడుతున్నారు. అక్టోబర్ 29న సంజీవ్ బబ్బర్ అనే వినియోగదారు ట్విటర్లో ఈ క్లిప్‌ను షేర్ చేశారు. ప్లాట్‌ఫాంలోని పసుపు రేఖకు అవతల నిలబడి మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “ఢిల్లీ మెట్రోలో ఇది మొదటిసారి జరిగి ఉండవచ్చు. ఇప్పుడే వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. మీతో షేర్ చేసుకుంటున్నాను” అని బబ్బర్ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తకి ఇక్కడ ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నారని అని అడగగా.. మత్తులో కనిపించిన ఆ వ్యక్తి.. “హో గయా, జ్యాదా హో గయా (నేను కొంచెం ఎక్కువగా తాగాను)” అని బదులిచ్చాడు. ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC), ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (CMO)ట్యాగ్ చేయడంతో.. డీఎంఆర్సీ స్పందించింది. అధికారులు తదుపరి విచారణ కోసం స్టేషన్ పేరును అడగగా.. సంజీవ్ బబ్బర్ స్పందిస్తూ.. మాల్వియా నగర్ మెట్రో స్టేషన్ అని అధికారులు చెప్పారు.
T20 World Cup: లంకపై ఇంగ్లండ్ విజయం.. సెమీస్ నుంచి ఆస్ట్రేలియా ఔట్
ఈ సంఘటన గురించి తెలిపిన సంజీవ్ బబ్బర్‌కు డీఎంఆర్సీ అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో పాటు ప్రయాణికులు ఇలాంటి ఘటనలను గమనించినట్లయితే.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ హెల్ప్ లైన్ నంబర్ కాల్ చేయొచ్చని సూచించారు. అంతే కాకుండా ప్రయాణీకులు సమీపంలోని డీఎంఆర్సీ అధికారిని కూడా సంప్రదించవచ్చన్నారు. తద్వారా చర్య తీసుకోవచ్చన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు “చాలా సిగ్గుచేటు”, “ఎవరూ అతన్ని ఎందుకు ఆపలేదు లేదా అక్కడికక్కడే కొన్ని చర్యలు తీసుకోలేదు?” అని కామెంట్ల వర్షం కురిపించారు.
Maybe this Happened first time in Delhi Metro.
Just received a video on wtsapp. Sharing with you pic.twitter.com/iJiWUnBpQy
— Sanjeev Babbar (@SanjeevBabbar) October 29, 2022