Mumbai: పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి.. అడ్డొచ్చిన వారిని..!
- పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడి
- ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఘటన
- దాడిలో పఠాన్ అనే వ్యక్తి మృతి
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
- ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిపై బాలుడు పదే పదే కత్తితో దాడికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు పాల్పడుతుండగా.. అక్కడే ఉన్న కొంతమంది ఆపలేకపోయారు. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ దాడికి సంబంధించి అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. మృతుడు అహ్మద్ పఠాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఓ మహిళ సహా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటన ఆగస్ట్ 8న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: Rajasthan Shocker: భార్యకు ఘోరమైన శిక్ష.. బైకుకి కట్టి ఈడ్చుకెళ్లిన భర్త..
Also Read
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Sangareddy: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.3 కోట్లతో భార్యాభర్తలు పరార్.!
- YCP Protest: ఉరవకొండలో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ!
- Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ 'ఆకిబ్ నబీ' ఎంట్రీ..!
శివాజీ నగర్‌లోని రోడ్డుపై బాధితుడు పఠాన్ నిలబడి ఉండగా.. ఒక్కసారిగా మైనర్ బాలుడితో సహా నలుగురు అతనిపై పడ్డారు. ఆ తర్వాత బాలుడు పఠాన్‌పై ఆవేశంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని ఆపుదామని వచ్చిన బాటసారులను కూడా బాలుడు బెదిరించాడు. ఈ క్రమంలో.. పఠాన్ పై మైనర్ బాలుడు పలుసార్లు దాడి చేస్తూనే ఉన్నాడు. కాగా.. మృతుడు, నిందితులు ఒకరికొకరు తెలుసని.. రెండు వారాల క్రితం వారి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవలు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Bangalore Bus Accident: బెంగళూరు ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వాహనాలపైకి దూసుకెళ్లిన ఓల్వో బస్సు!
ఈ క్రమంలో పఠాన్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో థానేలోని రాబోడి ప్రాంతంలో పాత గొడవలు కారణంగా 40 ఏళ్ల వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవ్వడంతో.. దుకాణ యజమానులు తమ సంస్థలను మూసివేశారు. బాధితుడు వసీం ఖురేషీ ఛాతీ, ముఖం, చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
- Tags
- attack
- Crime News
- dies
- Man
- minor
తాజావార్తలు
-
Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
-
Dr Mohan Rao Patibandla: గుంటూరు వైద్యుడికి అంతర్జాతీయ వేదికపై త్రివిజయం.. ఒకే సదస్సులో మూడు పురస్కారాలు!
-
Agent 47: కిరాయి హంతకులుగా మారిపోతున్న యువకులు.. ప్రకంపనలు రేపుతోన్న ‘ఏజెంట్-47’
-
Brij Bhushan Sharan Singh: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్ సింగ్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
-
Aditi Sharma: కప్పు కాఫీ కోసం రోడ్డున పడ్డ సంసారం.. గృహహింస కేసు పెట్టిన బుల్లితెర నటి
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!