Aaqib Nabi: బుమ్రా ఔట్.. టీమిండియాలోకి కొత్త పేసర్ ‘ఆకిబ్ నబీ’ ఎంట్రీ..!
- గాయం కారణంగా శ్రీలంక టెస్టు సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా దూరం ..
- బుమ్రా స్థానంలో జమ్మూకశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీని BCCI ఎంపిక
- ఆకిబ్ నబీకి భారత టెస్టు జట్టులో ఇదే తొలి అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaqib Nabi: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా శ్రీలంక పర్యటనకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని జమ్మూకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ‘ఆకిబ్ నబీ’ని జట్టులోకి ఎంపిక చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఆకిబ్ నబీకి భారత టెస్టు జట్టులో చోటు దక్కడం ఇదే మొదటిసారి.
ఎడమ మోకాలి గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దీంతో చివరి నిమిషంలో అతడిని శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరం చేయాల్సి వచ్చింది. బుమ్రా స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ సెలెక్టర్లు ఆకిబ్ నబీపై విశ్వాసం ఉంచారు.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
అయితే ఆకిబ్ నబీకి అవకాశం రావడానికి ప్రధాన కారణం.. దేశవాళీ క్రికెట్లో అతని అద్భుత ప్రదర్శనే. గత రెండు రణజీ ట్రోఫీ సీజన్లలో 104 వికెట్లు పడగొట్టి తానేంటో చెప్పకనే చెప్పాడు. ఇందులో 2025-26 సీజన్లో ఒక్క సీజన్లోనే 60 వికెట్లు తీసి జమ్మూకశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్యనే శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇండియా-A జట్టులో కూడా ఆకిబ్ నబీ చోటు దక్కించుకున్నాడు. అక్కడ రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకకు బయలుదేరనుంది. అనంతరం ఆగస్టు 7 నుంచి కొలంబోలో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాలేలో ప్రారంభం కానుండగా, రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది.
శ్రీలంక పర్యటనకు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (C), కేఎల్ రాహుల్ (VC), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (WK), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీ, గుర్నూర్ బరార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్.
𝗡𝗘𝗪𝗦:
Auqib Nabi replaces Jasprit Bumrah in India's Test squad.
Details 🔽 #TeamIndia | #SLvIND https://t.co/lAf25FbpDN
— BCCI (@BCCI) August 3, 2026
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?