గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వస్టేషన్ లో జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడంతో పాటు అతడి నుండి 18.5కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ జీఆర్పీపీ డిఎస్పి ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ సాయీశ్వర్ గౌడ్ ఆద్వర్యంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఒడిశాకు చెందిన సుదర్శన్ గంజాయి బ్యాగ్ లతో పట్టుపడ్డాడని డీఎస్పీ తెలిపారు. చాయి అమ్ముకునే సుదర్శన్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ మార్గాన్ని ఎన్నుకొన్నాడని అందులో భాగంగా ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి సికింద్రాబాద్ మీదుగా తరలించి గుజరాత్ లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని తెలిపారు. అతడి వద్ద నుండి 4లక్షల 61వేల విలువైన 18.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తరలించినట్లు వెల్లడించారు.
CM Yogi: యోగి చేతికి గాయం.. రిస్ట్ బ్యాండ్ రహస్యాన్ని బయటపెట్టిన సీఎం