ఏనుగు దంతాల రవాణాకు పాల్పడుతున్న ముఠాలను రాచకొండ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాచకొండ ఎస్ఓటి పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ తో ముఠాను పట్టుకున్నారు. ప్రసాద్ తిరుపతి జిల్లాలోని శేషాచలం ఫారెస్ట్ నుంచి ఏనుగు దంతాలు తీసుకువచ్చాడని తెలిపారు.
రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నాము.. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నాము.. ఇవి ఒరిజినల్ హా, కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించాము.. నిజమైనవి అని తేలిందని తెలిపారు.. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972ప్రకారం ఇది చట్టరీత్య నేరము.. ఏనుగు నుంచి ఇవి కట్ చేసి సేకరించారు.. ఈ కేసులోని ప్రకాష్ , లోకేశ్వర్ రెడ్డి ఈ దందా కొనసాగిస్తున్నారు.. శేషాచలం అడవులలోని ఏనుగుల నుంచి ఇవి సేకరించారు.. రాచకొండ పోలీసులు ఇల్లీగల్ యాక్టివిటిపై దృష్టి సారించారని తెలిపారు.. బస్సుల్లో తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు.. బస్సులో ఒక పెట్టలో పెట్టి తీసుకొచ్చారు..
Also Read:Mahavaatar: ఏకంగా 7 సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసిన హోంబాలే
అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నాం.. ఏనుగు దంతాల స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నాం.. పట్టుబడ్డ ఏనుగు దంతాలు 5.62కేజీలు ఉంటుంది.. నిందితులు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారు.. రూ. 3కోట్లు విలువ గల ఏనుగు దంతలు సీజ్ చేసాం.. కేజీ ఏనుగు దంతాలు 50 నుంచి 60 లక్షల వరకు మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు.. నిందితుడు ప్రసాద్ మాత్రమే పట్టుబడ్డాడు.. లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు.. ప్రసాద్, లోకేశ్వర్ ఇద్దరు గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారు.. ఇద్దరికి జైళ్ళో పరిచయం ఉంది.. ఇప్పుడు ఏనుగు దంతాల స్మగ్లింగ్ కి పాల్పడ్డారని” తెలిపారు.