Site icon NTV Telugu

Mamitha : ప్రేమలు నుండి పాన్ ఇండియా హీరోయిన్ గా మమిత

Mamita Biju

Mamita Biju

మమితా బైజు కెరీర్‌లో గేమ్ చేంజర్‌గా నిలిచిన సినిమా ‘ప్రేమలు’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మమితా పేరు మలయాళం దాటి తెలుగు, తమిళ ఆడియన్స్‌కి కూడా రీచ్ అయింది. నేచురల్ యాక్టింగ్, క్యూట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్ ఆడియన్స్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఈ క్రేజ్‌తోనే తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన మమితా  2025లో విడుదలైన డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మమితా కోలీవుడ్‌లోనూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదే ఊపులో విష్ణు విశాల్‌తో, రామ్‌కుమార్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా ఇరందు వానం సినిమాలో కూడా నటిస్తోంది.

Also Read : NBK : కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ

ఇప్పుడు మమితా బైజు లైన్‌అప్ మరింత పెద్దగా మారుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. అలాగే కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న సూర్య46 సినిమాలో కథానాయికగా కనిపించనుంది మమితా. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, ఈ చిత్రం సమ్మర్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మమితా బైజు లైనప్ లో బెత్లెహెం కుడుంబ యూనిట్ తో పాటు, ధనుష్ 54 తమిళ సినిమాలోనూ మమితా నటించే ఛాన్స్ ఉందంటున్నారు.. మలయాళం నుంచి మొదలైన ప్రయాణం ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ప్రాజెక్ట్స్ వరకూ చేరింది. క్యూట్ ఇమేజ్‌తో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాల్ని ఎంచుకుంటూ స్టడీగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న మమితా బైజు రాబోయే రోజుల్లో సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కి మరింత పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనుందని చెప్పొచ్చు.

Exit mobile version