NTV Telugu Site icon

MP Mallu Ravi: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

Mallu Ravi

Mallu Ravi

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ వచ్చారని వెల్లడించారు.

READ MORE: Ex IAS Officer Imtiaz: వైసీపీకి మరో షాక్‌..! రాజకీయాలకు మాజీ ఐఏఎస్‌ గుడ్‌బై..

భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గల ముఖ్య కారకుడు మన్మోహన్ సింగ్ అని మల్లు రవి కొనియాడారు. ఆ ఐదు సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులను బయటపడి ప్రగతి పథంలో ముందుకు వెళ్ళిందన్నారు. మన్మోహన్ సింగ్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరని.. దేశం ఒక మహా నేతను కోల్పోయిందన్నారు. మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సంస్కరణల అడుగుజాడల్లోనే తదుపరి వచ్చిన ప్రధాన మంత్రులు నడుచుకున్నారని స్పష్టం చేశారు. ఆయనను గొప్ప ప్రధానిగా గుర్తించి సేవలను అందరూ తలచుకుంటున్నారన్నారు.

READ MORE: TTD: తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త..

ఇదిలా ఉండగా.. మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Show comments