మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ…
దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి హఠాన్మరణం చెందారు. సోషల్ మీడియాలో ఆయనకు ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. కొంతమంది వినియోగదారులు మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో మంచం మీద పడుకున్న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ.. "ఇది మన్మోహన్ సింగ్ చివరి క్షణాల ఫొటో" అని పేర్కొంటున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో నిజమెంతో తెలుసుకుందాం..
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో 26 డిసెంబర్ రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.