Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గీతా గోవిందం సినిమాతో తెలుగుతెరకు పరిచయమై.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక రష్మిక కు వివాదాలు కొత్త కాదు.. ట్రోల్స్ లెక్క లేదు. నిత్యం ఏదో విధంగా ఆమె ఎన్నో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది. కొంతమంది ఆమెకు నటన రాదని ట్రోల్స్ చేస్తూ ఉంటారు.. ఇంకొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తోంది అని చెప్పుకొస్తూ ఉంటారు. ఇక ఇవన్నీ కాకుండా విజయ్ దేవరకొండతో ఎఫైర్ ఉందంటూ మరికొందరు ట్రోల్స్ చేస్తారు. ఇక గత కొన్ని రోజుల నుంచి రష్మిక తన ఫ్యాషన్ లుక్స్ తో ట్రోల్స్ చేయబడుతోంది. మొదటి నుంచి కూడా ఈ ముద్దుగుమ్మ కొద్దిగా ఎక్స్ పోజింగ్ తక్కువే చేస్తూ కనిపించేది. ఈ మధ్య అమ్మడు కంచెలు దాటేసింది. బాలీవుడ్ హీరోయిన్స్ లా.. థైస్ అందాలను, ఎద అందాలను ఆరబోసి చూపిస్తూ అభిమానుల ఆగ్రహానికి గురి అవుతోంది. గతేడాది చివర్లో కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో ఇలాగే అమ్మడికి సెట్ కానీ డ్రెస్ వేసుకొని తెగ ఇబ్బంది పడింది. థైస్ ను ఎలివేట్ చేసే డ్రెస్ లో దాన్ని పైకి లాక్కోలేక, మీడియా ముందు పరువు పోగొట్టుకుంది.
Samantha: అది మా చైతన్య అంటే.. నీలా కాదు
ఇక తాజాగా మరోసారి నేషనల్ క్రష్ అలాంటి చిట్టి డ్రెస్ లో రెడీ అయ్యి ట్రోలింగ్ బారిన పడింది. తాజగా ఈ ముద్దుగుమ్మ ఒక అవార్డు ఫంక్షన్ లో బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేసింది. ఒక మినీ డ్రెస్ మాత్రమే ఆమె ఒంటిని కప్పి ఉంది. థైస్, ఎద భాగాలు అచేతనంగా వదిలేసింది. ఇక వెనుక ఉన్న లాంగ్ క్లాత్ మొత్తం కింద ఫ్లోర్ ను ఊడ్చేస్తుందా అన్నట్లు కనిపించింది. ఇందులో రష్మిక హాట్ గానే కనిపిస్తోంది.. కానీ ఆ డ్రెస్ తో ఆమె ఎన్నో ఇబ్బందులు పడింది. ఆమె థైస్ అందాలను క్యాప్చర్ చేయడానికి కెమెరాలు తెగ కష్టపడ్డాయి. దాంతో ఆమె తన చేతులను థైస్ మీద అడ్డుపెడుతూ చాలు చాలు అంటూ ఇంకా అంటూ వెళ్ళిపోయింది.. ఎంత వద్దు అంటే మాత్రం అయినా కెమెరాలు ఆగుతాయా.. పిచ్చెక్కించేశాయి. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ప్యాంట్ వేసుకోకుండా చేతులు అడ్డుపెడితే ఆగుతారా..? అని కొందరు.. నువ్వు కూడా ఇలా తయారవుతావని అనుకోలేదు రష్మికా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.