Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి ఆర్. ప్రవీణ్ కుమార్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్టల్‌లోని నాలుగో అంతస్తులో ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్ కుమార్ స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా తోటకుర్తి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృత దేహాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
రాంతి ప్రవీణ్ కుమార్ ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. ఇళ్లకు వెళ్లే వారికి ఔట్ పాస్‌లు అందజేస్తున్నారు.ప్రవీణ్ కుమార్ తో పాటు అతని స్నేహితులు కూడా ఔట్ పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఉదయం ప్రవీణ్ కుమార్ స్నేహితుడు ఔట్ పాస్ తీసుకుని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికి ప్రవీణ్ బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతడి స్నేహితుడు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన సిబ్బంది యూనివర్సిటీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు బీహెచ్‌లోని ఖాళీ గదిలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో బైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదికి తాళం వేయకుండా ఖాళీగా ఉంచినట్లు మరికొందరు విద్యార్థులు అనుమానిస్తున్నారు.
Also Read
మృతుడి తల్లి మూడు నెలల కిందటే గుండెపోటుతో మృతి చెందింది. ఇటీవలే తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో ప్రవీణ్ మానసికంగా కుంగిపోయాడని ప్రవీణ్ స్నేహితులు చెబుతున్నారు. రెండో పెళ్లి విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో తండ్రి మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆందోళన వ్యక్తం చేశారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఏడాది ఆగస్టు నెలలో బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో బబ్లూ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన జాదవ్ బబ్లూ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 13న బాసర ట్రిపుల్ ఐటీలో దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అదే నెల 15న లిఖిత అనే విద్యార్థిని మృతి చెందింది. దీంతో ఈ ఇద్దరి మృతిపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు.
Girls Fight for Selfie: సెల్ఫీ విషయంలో వివాదం.. పొట్టుపొట్టు కొట్టుకున్న యువతులు..
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!