మాళవిక మోహన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎలాంటి డ్రెస్ లో అయినా కానీ తన అందం తో అందరినీ కట్టిపడేస్తుంది మలబార్ సోయగం మాళవిక మోహనన్.సోషల్ మీడియా లో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాజాగా కర్రసాము నేర్చుకునే పని లో పడింది.ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తూ.. సోషల్ మీడియా లో తన అందం తో నెటిజన్ల ను బాగా ఇంప్రెస్ చేసే భామల్లో మాళవిక టాప్ లో ఉంటుంది. ఈ మలబార్ సోయగం మాళవిక మోహనన్ ప్రస్తుతం కర్రసాము చేస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్అ వుతున్నాయి.ప్రస్తుతం ఈ భామ ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ రాజా డీలక్స్ అనే సినిమా లో నటిస్తోంది. అలాగే ఈ భామ ఖాతా లో విక్రమ్ నటిస్తోన్న తమిళ్ మూవీ తంగలాన్ మరియు హిందీ ప్రాజెక్ట్ యుద్ర ఉన్నాయి.
తంగలాన్ నుంచి తాజాగా లాంఛ్ చేసిన మాళవికా మోహనన్ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు అదిరిపోయే గ్లామర్ డాళ్ లా అలరించిన మాళవిక ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా డీ గ్లామర్ పాత్ర లో కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ స్టిల్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్. మాళవికా మోహనన్ ఈ సినిమా కోసమే కర్రసాము నేర్చుకునే పనిలో ఉందేమో అని వార్తలు వస్తున్నాయి.తాజా వీడియో చూసిన నెటిజన్లు లైక్స్ మరియు కామెంట్స్ తో ఆ వీడియో ని తెగ వైరల్ చేస్తున్నారు.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) లో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యం లో తెరకెక్కుతున్న తంగలాన్ సినిమా ను స్టూడియో గ్రీన్ మరియు నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై కేఈ జ్ఞానవేళ్ రాజా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.