Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Steel Plant Accident: విశాఖపట్నంలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) పరిధిలోని సీసీడీ (CCD) విభాగంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం సంభవించడంతో ప్లాంట్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ద్రవ ఉక్కు (హాట్ మెటల్) రవాణా చేస్తున్న ల్యాడిల్ లేదా కన్వేయర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో భారీ మొత్తంలో ద్రవ ఉక్కు కింద పడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే ప్లాంట్ భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. గాయపడిన వారి సంఖ్యపై అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రమాదానికి సంబంధించి కొన్ని వర్గాలు కార్మికులు అగ్నికీలల్లో చిక్కుకున్నారని పేర్కొంటున్నప్పటికీ, మృతులు లేదా గాయపడిన వారి సంఖ్యపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించి ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. పూర్తి వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే, ల్యాడల్ నుంచి హాట్‌మెటల్ బకెట్లు కుప్పకూలడంతో.. ఇప్పటి వరకు 9 మంది కార్మికులు సజీదహనం అయినట్టు చెబుతున్నారు.. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. మొత్తంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతన్నారు..
Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- TV Serial Scam: హీరోయిన్ ఛాన్స్ పేరుతో సైబర్ మోసం.. విశాఖలో రూ.60 లక్షల దోపిడీ!
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
తాజావార్తలు
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
-
Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
-
Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
-
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
-
Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే…
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!