Vizag Adventure Sports : వైజాగ్ టూరిజంలో సరికొత్త థ్రిల్.. అదరగొడుతున్న సాహస క్రీడలు.!
- ఋషికొండలో పారాసైలింగ్, పారామోటరింగ్ థ్రిల్
- కైలాసగిరిలో స్కై సైక్లింగ్‌తో గాల్లో సాహసం
- గ్లాస్ స్కై వాక్‌పై గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అనుభవం
- వైజాగ్ టూరిజంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ కొత్త హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పర్యాటక ప్రియులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సిటీ ఆఫ్ డెస్టినీ ‘విశాఖపట్నం’ ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ (సాహస క్రీడలు) హబ్‌గా మారుతోంది. కేవలం ప్రశాంతమైన సముద్ర తీరాలు, కొండల అందాలను చూసి ఆస్వాదించడమే కాకుండా, మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్లో సాహసాలు చేయాలనుకునే పర్యాటకుల కోసం వైజాగ్ సరికొత్త క్రీడలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ఋషికొండ, కైలాసగిరి కొండలపై పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఆ క్రేజీ అడ్వెంచర్ల విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఋషికొండ బీచ్.. సముద్రపు అలలపై సాహసాలు
విశాఖలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఋషికొండ బీచ్ ఇప్పుడు సాహస క్రీడలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడ పర్యాటకుల కోసం పారామోటరింగ్, పారాసైలింగ్ వంటి అద్భుతమైన క్రీడలు అందుబాటులో ఉన్నాయి. మోటార్ సహాయంతో పనిచేసే ఒక మినీ హెలికాప్టర్ లాంటి పారామోటరింగ్ ఎక్కి ఆకాశంలో పక్షిలా ఎగురుతూ, పైనుండి నీలిరంగు సముద్రపు అందాలను చూడటం పర్యాటకులకు ఒక మరువలేని అనుభూతిని ఇస్తుంది. అలాగే వేగంగా దూసుకెళ్లే బోటు సహాయంతో గాలిలోకి ఎగిరే పారాసైలింగ్ కూడా ఇక్కడ ఎంతో పాపులర్ అయింది. వీటితో పాటు సర్ఫింగ్, సముద్ర గర్భంలోకి వెళ్లి వింతలను చూసే స్కూబా డైవింగ్ , కయాకింగ్ వంటి క్రీడలు అడ్వెంచర్ లవర్స్‌కు ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భద్రతా ప్రమాణాలు పాటించడం వల్లే ఋషికొండ బీచ్‌కు ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు లభించింది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
కైలాసగిరి.. కొండల మధ్య స్కై సైక్లింగ్, జిప్ లైనర్
సముద్ర మట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే కైలాసగిరిపై విఎంఆర్డిఏ (VMRDA) పర్యాటకుల కోసం సరికొత్త సాహసాలను ప్రవేశపెట్టింది. రెండు కొండల మధ్య ఏర్పాటు చేసిన జిప్ లైనర్ ద్వారా ఒక కొండ నుండి మరో కొండకు తాడు సహాయంతో వేగంగా దూసుకెళ్లడం పర్యాటకులలో థ్రిల్‌ను పెంచుతోంది. దీనికి తోడు, వందల అడుగుల ఎత్తులో కేవలం ఒక చిన్న తీగ (వైర్) పై సైకిల్ తొక్కే ‘స్కై సైక్లింగ్’ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గాల్లో తేలుతూ సైకిల్ తొక్కుతున్న ఫీలింగ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్.. గాల్లో నడుస్తున్న అనుభూతి
కైలాసగిరి కొండపై పర్యాటకులను అత్యంతంగా ఆకర్షిస్తున్న మరో అద్భుతమైన నిర్మాణం ‘కాంటిలివర్ గ్లాస్ స్కై వాక్’. కొండ చివరన లోయ వైపునకు ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉండే ఈ గాజు వంతెనపై నడుస్తుంటే కింద ఉన్న అగాధం, ఎదురుగా ఉన్న అనంతమైన సముద్రం కనిపిస్తూ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఈ గ్లాస్ వాక్‌పై నడుస్తూ ఫొటోలు దిగడానికి పర్యాటకులు ఎగబడుతున్నారు.
ఇలా ప్రకృతి అందాలతో పాటు సరికొత్త అంతర్జాతీయ స్థాయి సాహస క్రీడలను ప్రోత్సహిస్తూ విశాఖ నగరం పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. మీ వీకెండ్, హాలిడేస్ లో ఒక క్రేజీ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వైజాగ్ లోని ఈ ప్రాంతాలను విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వకండి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!