Mahindra XUV 700 AX7 Price Reduced: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 700’కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్, మంచి సేఫ్టీ ఉన్న ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఎక్కువగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లే కనబడుతున్నాయి. మార్కెట్లోకి ప్రవేశించిన అనతికాలంలోనే 2 లక్షల యూనిట్ల అమ్మకాలను ఇటీవల పూర్తి చేసింది. అయితే ఎక్స్‌యూవీ 700ను కొనాలనుకునే వారికి ఓ శుభవార్త.
ఎక్స్‌యూవీ 700ని మార్కెట్‌లో విడుదల చేసి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త ధరలను ప్రకటించింది. ఎక్స్‌యూవీ 700 ఏఎక్స్ 7 వాహన శ్రేణి ధరలను తగ్గించింది. ఏఎక్స్ 7 వేరియంట్ ఇప్పుడు రూ.19.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. గతంలో ఈ వేరియంట్ ధర రూ.21.54 లక్షలుగా ఉంది. ఎంపిక చేసిన వేరియంట్లపై గరిష్ఠంగా రూ.2.2 లక్షల మేర తగ్గింపు లభిస్తుంది. కొత్త ధరలు నేటి (జులై 10) నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ ధరలు కేవలం 4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
Also Read: Rahul Dravid Reward: నాకు రూ.5 కోట్లు వద్దు.. వారికి ఇచ్చిన ప్రైజ్‌మనీనే ఇవ్వండి!
మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే ఎక్స్‌యూవీ 700 ఏఎక్స్ 7 మోడల్‌లో డీప్ ఫారెస్ట్, బర్న్ట్ సియెన్నా పెయింట్ ఆప్షన్లను కూడా తీసుకొచ్చింది. దాంతో మొత్తంగా 9 ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ శ్రేణిలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన అడాస్ లెవల్ 2 వంటి అత్యాధునిక భద్రతా సదుపాయాలు ఇందులో ఉన్నాయి.