ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా కొత్త వెహికల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. వాణిజ్య విభాగంలో మహీంద్రా బొలెరో పిక్-అప్ HD 1.9 CNGని భారత మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా బొలెరో మాక్స్ పిక్-అప్ HD 1.9 CNG ని రూ. 11.19 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది. ఇది 1.85 టన్నుల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనితో పాటు, ఇది AC, హీటర్, హైడ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు కూర్చొని ప్రయాణించేలా రూపొందించారు. పవర్ స్టీరింగ్, కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, 3050 mm కార్గో బెడ్, 16 అంగుళాల టైర్లు, ముందు, వెనుక యాక్సెల్స్ పై మన్నికైన లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది.
Also Read:Toll Tax: తప్పుడు ప్రచారం.. టూవీలర్లకు ‘‘టోల్ ట్యాక్స్’’పై నితిన్ గడ్కరీ క్లారిటీ..
మహీంద్రా బొలెరో పికప్ HD 1.9 CNG లో 2.5 లీటర్ టర్బో ఇంజిన్‌ను అందించింది. ఇంజిన్ 61 కిలోవాట్ల శక్తిని, 220 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 180 లీటర్ల సామర్థ్యం గల CNG ట్యాంక్ అందించారు. ఫుల్ ట్యాంక్ తో ఇది 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. దీనికి ఐదు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కూడా ఉంది.