Maheshwar Reddy : రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయాడా…. గజినిగా మారాడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేవంత్ రెడ్డి మతిస్థిమితం కొల్పోయాడా…. గజినిగా మారాడా అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని, కాళేశ్వరం పోయింది పోన్ ట్యాపింగ్ వచ్చింది… పోన్ ట్యాపింగ్ పోయి మరో అంశం తెరపైకి తెచ్చారన్నారు మహేశ్వర్ రెడ్డి. రెఫరెండం అన్నావు 14 సీట్లు గెలుస్తామని అన్నావు… 14 గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మీరు స్పందించలేదని, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు కలిసి డ్రామా ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హరీష్ రేవంత్ ల చీకటి ఒప్పందం లో భాగంగానే ఈ రాజీనామా లా నాటకమని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు హరీష్ రావు నాయకత్వం వహిస్తారని అనుమానం వస్తుందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.
అంతేకాకుండా..’రుణమాఫీ మీద హంగామా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నువ్వు బాలకృష్ణ అభిమానివి అని తెలుసు… హామీలు నెరవేర్చక పోతే ప్రభుత్వం ఎందుకు అని డైలాగ్ లు కొడుతున్నావు. ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షలు ఇస్తా అన్నావు దాని సంగతి మర్చిపోయావా. ప్రతి ఎస్సీ ఎస్టి కుటుంబానికి 12 లక్షలు ఇస్తా అన్నది మర్చిపోయావా. గాంధీ భవన్ కు నా లెటర్ హెడ్ పంపిస్తున్న దాని మీద రాజీనామా ఫార్మాట్ లో పంపించు… మీరు ఇచ్చిన హామీలు ఆగస్టు 15 లోపు నెరవేస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఒక ఫేక్ సీఎం వి, అబద్దాల ముఖ్యమంత్రి. రాజ్యాంగం నీ అత్యధిక సార్లు సవరించిన పార్టీ కాంగ్రెస్. మైనారిటీ రిజర్వేషన్ ల వల్ల బీసీ, ఎస్సీ ఎస్టీ లకు అన్యాయం చేసింది వాస్తవం కాదా. బీసీ స్థానాల్లో ముస్లిం లు పోటీ చేస్తున్నది వాస్తవం కాదా. కాంగ్రెస్ అధికారం లోకి 12 శాతం రిజర్వేషన్ లు అమలు చేస్తుంది .. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తుంది. రేవంత్ రెడ్డి మీ కెప్టెన్ ఎవరు… ఎగిరెగిరి పడుతున్నావు… నీ పార్టీ ఏడున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కి తక్కువ ప్రాంతీయ పార్టీ కి ఎక్కువ’ అని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
Also Read
- రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
- Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
తాజావార్తలు
-
Shubhakshetra Fraud: శుభాక్షేత్ర మోసం.. మరో కీలక నిందితుడు అరెస్ట్.!
-
రూ.11,999 ధర, 8GB RAM, 6000mAh బ్యాటరీతో 5G స్మార్ట్ ఫోన్స్.. వచ్చే వారంలోనే గ్రాండ్ రిలీజ్..
-
CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Dharmendra Pradhan: సోషల్ మీడియా ఖాతాల్లో మార్పు.. కేంద్రమంత్రి హోదా తొలగింపు
ట్రెండింగ్
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!