కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. రేవంత్ వ్యవహారంతో పార్టీలో సీనియర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. గంటలో సమాధానం ఇవ్వాలని నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చి అవమాన పరిచారని, పార్టీ మారకుండా ఆపేందుకు రేవంత్ ఫోన్ చేయలేదని, ఉత్తమ్, జీవన్ రెడ్డి, సంపత్ లు ఫోన్ చేశారని ఆయన తెలిపారు. ఒంటెద్దు పోకడతో మమల్ని బయటకు పంపాలని చూస్తున్నారని, కాంగ్రెస్‌లోనుంచి ఒక్కొక్కరు బయటకు పోతున్నారన్నారు.
Also Read : MVV Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు, బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు
మర్రి, రాజ్ గోపాల్ రెడ్డి వెళ్లిపోయారు.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నారాజు గా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. పాద యాత్ర అపమంటే ఆపేశానని, పాదయాత్ర ఆపడానికి కారణం అడిగా, చెప్పలేదన్నారు. గంటలో సమాధానం ఇవ్వాలని షోకాజ్ ఇస్తారా.. దాని వెనుక కుట్ర అర్థం చేసుకోలేనా అని ఆయన వ్యాఖ్యానించారు. నన్ను తరిమెయ్యలని చూశారని, నేనే బయటకు వచ్చానన్నారు. నా జిల్లాలో ఖర్గే సమావేశం ఉందని, మరి అక్కడ మీటింగ్ లో ఎలా పాల్గొనాలన్నారు. అందుకే రాజీనామా చేశానని, పొత్తుల విషయంలోనూ గందరగోళ ప్రకటనలు చేస్తున్నారన్నారు.
Also Read : Meta: ఫ్రీ ఫుడ్ ఇక లేదు.. మెటా నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి..