Jabardasth New Anchor : యాంకర్ రష్మీ స్థానంలో కొత్త అమ్మాయి సౌమ్యరావు జబర్ధస్త్ షోకు హోస్ట్ గా వచ్చారు. తనదైన శైలిలో రెండు వారాల పాటు షోను రన్ చేశారు. అమ్మడి స్ర్కీన్ లుక్ బాగుందని పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ లో సందడి చేసిన సౌమ్యరావు ఇప్పుడు మూడవ ఎపిసోడ్ కు సిద్ధం అవుతోంది. ఆమెకు సంబంధించిన ఒక చిన్న వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తెర వెనుక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను బయట పెట్టింది.
Read Also: Nagashaurya Marriage: తాళికట్టిన నాగశౌర్య.. ఫోటోలు వైరల్
సౌమ్యరావు జీవితంలో కూడా అనేక కష్టాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి విన్న నెటిజన్ల హృదయాన్ని కలచి వేస్తున్నాయని చెప్పవచ్చు. తాను అందరూ ఉండి కూడా అనాథనని తెలిపి.. అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల ఈటీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఆషోకు యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ .. మీ గురించి ఏదైనా చెప్పమని అడిగాడు. ఆ సమయంలో సౌమ్యరావు తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పింది.. తన కుటుంబం గురించి మాట్లాడుతూ..” నా లైఫ్ గురించి చెప్పను .. నాకు అమ్మ లేదు.. నాన్న ఉండి కూడా లేడు.. ప్రస్తుతం నేను ఒక అనాథని.. నాకు ఎవరూ లేరు.. ఇక్కడ ఉన్న వారందరికీ అమ్మనో.. నాన్ననో.. బ్రదరో, సిస్టరో ఎవరో ఒక్కరైనా ఉంటారు . కానీ నాకు ఎవరూ లేరు. ఇలాంటి ఫ్యామిలీ దొరికినప్పుడు చాలా బాగా చూసుకుంటాను” అంటూ కన్నీళ్లు పెట్టుకొని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.