టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. “ఎస్ఎస్ఎంబీ 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇటీవలే మహేష్ గుంటూరు కారం సినిమాతో మంచి విజయం అందుకున్నాడు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మహేష్ రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో రాబోతున్నారు.. రాజమౌళి సినిమా అంటే యాక్షన్ కి ఏ మాత్రం డోకా ఉండదు.. అలాగే ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్ అని చెప్పవచ్చు.. రాజమౌళి సినిమాలు టెక్నికల్‌గా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ను అందిస్తాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో రాజమౌళి వ్యూహం ఎప్పుడు మిస్ కాలేదు.నిజానికి ఆ నటుడు నుంచి ప్రేక్షకుడు ఏమి కోరుకుంటాడో రాజమౌళి ముందుగానే ఊహిస్తాడు..ఆ ఊహకు తగ్గట్టు యాక్షన్ ప్లాన్ రచిస్తాడు..
ఆయన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1′ నుంచి ఇప్పటి ‘ఆర్‌ఆర్‌ఆర్’ వరకు ఆయన సినిమాలన్నీ అలా వచ్చినవే.రానున్న మహేశ్ సినిమా కూడా స్క్రిప్ట్ పరంగా ఎమోషనల్ గా సాగ నుందని సమాచారం.దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఓ నవల ఆధారంగానే ఈ మూవీ కథను రాయడం జరిగిందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయం తెలిసిందే… ఈ కథ విషయంలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని తెలుస్తుంది.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే నిధి కోసం సాగే వేటగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.అలాగే ఈ సినిమాలో మహేశ్ పాత్ర విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది.హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రాజమౌళి మహేష్ పాత్రను డిజైన్ చేశారని సమాచారం.. అలాగే ఈ సినిమాలో మహేశ్ లుక్‌ని కూడా ఎంతో డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.