టాలివుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమానే ‘గుంటూరు కారం’.. ఆ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి.. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా శ్రీలీలా నటిస్తుంది..
మరో హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో వేసిన సెట్‌లో జరుగుతోంది.. ఈ సినిమాలో మాస్ సాంగ్ ఇదే.. ఈ సాంగ్ పూర్తయితే సినిమా దాదాపు పూర్తి అయినట్లే.. ఇక సినిమాలోని కొన్ని చిన్న చిన్న ఫ్యాచ్ వర్క్ లను కూడా ఈ నెల ఆఖరిలో పూర్తి చెయ్యనున్నట్లు తెలుస్తుంది..
ఇకపోతే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ వెకేషన్‌కు వెళతారట మహేశ్‌బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారు.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది..