Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Meets Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు శనివారం (నవంబర్ 28) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఈ సమావేశం జరిగింది. తొలుత సీఎం రేవంత్ రెడ్డికి మహేశ్ బాబు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య ఏయే విషయాలు చర్చకు వచ్చాయనే దానిపై అధికారిక సమాచారం వెల్లడికాలేదు.
ఇదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, స్వతంత్ర మైక్రోఫిన్ చైర్పర్సన్ అనన్య బిర్లా కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమానికి ఆమె సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అనన్య బిర్లాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’లో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీలు..
- 11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
- Telangana Eagle Force: తెలంగాణ ఈగల్ ఫోర్స్ సమాచారంతో భారీ ఆపరేషన్.. నాగ్‌పూర్‌లో రూ.1.75 కోట్ల డ్రగ్స్ సీజ్
- Senior Heroines: టాలీవుడ్‌కు దూరమైన స్టార్ హీరోయిన్లు.. అనుష్క నుంచి తమన్నా ఇప్పుడు ఏం చేస్తున్నారు?
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై ఇండియా కూటమి తరఫున తన వాదనను వినిపించేందుకు ఆయన సిద్ధమయ్యారు. కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో కలిసి నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాలకు కలిగే నష్టాలు, దక్షిణాది రాష్ట్రాలపై పడే ప్రభావం వంటి అంశాలను ఈ సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం. అలాగే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. పార్టీ విప్ జారీ చేసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలకు సీఎం సూచించినట్లు సమాచారం.
మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే సినిమా విడుదల తేదీ మారే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
శనివారం MCRHRD లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సినీ నటుడు మహేష్ బాబు.
Actor Mahesh Babu Pays a Courtesy Visit to Chief Minister Revanth Reddy at MCRHRD on Saturday.
#MaheshBabu #RevanthReddy https://t.co/P3G7dzpJN4
— Congress for Telangana (@Congress4TS) November 29, 2026
తాజావార్తలు
-
Mahesh Babu Meets Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో మహేశ్ బాబు భేటీ.. అసలు కారణం అదేనా.?
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుపై రంగంలోకి ఖర్గే, రాహుల్, సోనియా.. స్టాలిన్, శరద్ పవార్‌తో భేటీలు..
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
NDA Passing Out Parade: 364 మంది క్యాడెట్లు పాసౌట్.. యూనిఫామ్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్‌కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!