గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ద బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “ద బ్లఫ్ ఒక అద్భుతమైన చిత్రం.. యాక్షన్ మరియు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారు” అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.
Also Read : TVK VIJAY : విజయ్ కు మరో షాక్.. మొన్న భార్య.. నేడు కొడుకు
మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్‌కు ప్రియాంక చోప్రా స్పందిస్తూ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “థాంక్యూ మహేశ్.. సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా!” అంటూ ఆమె బదులిచ్చారు. వీరిద్దరూ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక ఇచ్చిన హింట్‌తో, ఈ సినిమా తదుపరి భారీ షెడ్యూల్ అంటార్కిటికా ఖండంలో ఉండబోతోందని స్పష్టమవుతోంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని నైలు నది పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు కథ డిమాండ్ మేరకు టీమ్ అంటార్కిటికా మంచు ఖండానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు ‘రుద్ర‘ పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్న ఈ సినిమా, ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
