Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో విషాద ఘటన
- ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కొడుకును కాపాడబోయి తండ్రి, తల్లి మృతి.
- కొండ అంచుపై నుంచి పడిన తండ్రి, కుమారుడు..
- ఇది చూసి తల్లి కూడా కొండపై నుంచి దూకి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొడుకును కాపాడే క్రమంలో తల్లి, ఇది చూసిన తల్లి ముగ్గురూ మరణించారు. కొండ అంచున నిలబడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన 18 ఏళ్ల యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి కూడా కొండ పైనుంచి కిందపడి మరణించారు. తీవ్ర మనోవేదనకు గరైన తల్లి కూడా కొండ పైనుంచి పడిపోయింది. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఖవ్డా హిల్ వద్ద శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.
దేవ్లాయ్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఉదయం 10 గంటలకు కొండ అంచుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దాదాపు 3 గంటల పాటు యువకుడిని గ్రామస్తులు, బంధువులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తన భవిష్యత్తు, అమ్మానాన్నల గురించి ఆలోచించాలని కోరారు. అయినప్పటికీ యువకుడు కొండ అంచుపై నుంచి కదలలేదు. చివరకు 15-20 నిమిషాల్లో తండ్రి కొండపైకి ఎక్కి కొడుకును వెనక్కి తీసుకురావాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరు కొండ అంచు నుంచి జారిపడి మరణించారు. తీవ్ర ఆందోళనకు గురైన తల్లి కూడా కొండ పై నుంచి నుంచి పడిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురూ మరణించారు.
Also Read
ఘటనా స్థలంలో గ్రామస్తులతో పాటు పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా యువకుడికి నచ్చ చెప్పి, కొండ నుంచి దిగేలా ప్రయత్నించారు. చివరకు ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. తల్లిదండ్రులు, ఇతరులు యువకుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారని, అయినప్పటికీ అతనున వారి మాట వినకుండా కొండ అంచునే నిలబడ్డాడని చెప్పారు. తల్లి కూడా తన కొడుకును కొండ అంచు నుంచి రావాలని పదే పదే వేడుకున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!